MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ మంజూరు
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు. రిమాండుకు పంపాలన్నవాదనలను తోసిపుచ్చింది. రాజాసింగ్ అరెస్టు, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి.
Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు. రిమాండుకు పంపాలన్నవాదనలను తోసిపుచ్చింది. రాజాసింగ్ అరెస్టు, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే రాజాసింగ్ ను అరెస్టు చేశామని, బెయిల్ ఇస్తే ఉద్రిక్తతలు పెరుగుతాయని, శాంతిభద్రతలు లోపిస్తాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ప్రాసిక్యూషన్ వాదనలను రాజాసింగ్ న్యాయవాది వ్యతిరేకించారు. నమోదైన కేసులన్నీ బెయిలబుల్ కేసులని కోర్టుకు తెలియజేశారు. రాజాసింగ్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ రిక్వెస్ట్ ను తోసిపుచ్చి, బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు రాజాసింగ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది.