Flora Shiny : నా పరిస్థితి కూడా శ్రద్దా వాకర్ లా అయ్యేది : ఫ్లోరా సైని
Flora Shiny : ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ అనే అమ్మాయి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరి తెలిసిందే. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు.
Flora Shiny : ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ అనే అమ్మాయి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరి తెలిసిందే. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు. బంధువుల కంప్లైంట్ తో శ్రద్ధ కేసు వెలుగు లోకి వచ్చింది. తాజాగా బాలీవుడ్ నటి ఆషా షైనీ… తనకి కూడా శ్రద్దా వాకర్ లాంటి పరిస్థితి వచ్చేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ నటి ఆషా షైనీ అసలు పేరు ఫ్లోరా షైనీ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె 1999 లో విడుదలైన ” ప్రేమ కోసం ” అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కాగా ఆ తర్వాత తెలుగులో నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది ఈ నటి. ముఖ్యంగా బాలయ్య సరసన చేసిన ” లక్స్ పాప ” సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. 2014 నుంచి తెలుగు సినిమాలకు దూరమైన ఈ భామ… వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ గా మారింది.
కాగా గతంలో ఫ్లోరా సైని బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషితో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసింది. అనంతరం వారి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయారు. విడిపోయింది. 2018 లోనే మీటూ ఉద్యమం జరిగినప్పుడు గౌరంగ్ దోషిపై తీవ్ర ఆరోపణలు చేసింది ఫ్లోరా. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి గౌరంగ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గౌరవ్ తనను తీవ్రంగా కొట్టేవాడని… అతడు కొట్టిన దెబ్బలకు ఒకసారి తన దవడ విరిగిపోయిందట. ఒకరోజు తనకి భయపడి ఒంటిపై బట్టలు ఉన్నాయ్యో లేవో కూడా చూసుకోకుండా బయటకు పరుగెత్తినట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అదే విధంగా ఇంట్లో వాళ్ళు వద్దన్నా అతని దగ్గరికి వెళ్ళిపోయానని… మొదట నన్ను నా కుటుంబానికి దూరం చేశాడు. అతని ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే అతని అసలు రూపం బయటపెట్టాడు. రోజూ కొట్టేవాడు మొదట్లో నేనే ఏమన్నా తప్పు చేశానేమో అనుకోని సర్దుకుపోయేదాన్ని. నన్ను మానసికంగా, శారీరికంగా చాలా బాధపెట్టాడు. నేను వెళ్ళిపోతాను అంటే చంపేస్తానని బెదిరించాడు. మా పేరెంట్స్ ని కూడా బెదిరించాడు. ఒకరోజు బాగా కొట్టి ఇవాళ చంపేస్తాను అని అన్నాడు. ఆ సమయానికి అనుకోకుండా మా అమ్మ వచ్చింది. అంతే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. అప్పుడు మా అమ్మతో బయటకి వచ్చేశాను. పోలీసులకి మొదట కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు సీరియస్ గా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాక తీసుకున్నారు. ఒకవేళ ఆ రోజు నేను మా అమ్మతో పాటు వచ్చేసి ఉండకపోతే నా పరిస్థితి కూడా శ్రద్ధా వాకర్ లాగే అయ్యేదేమో అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.