Sraddha Walker Murder Case: సినిమాగా శ్రద్దవాకర్ హత్యకేసు
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
Sraddha Walker Murder Case: ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మనీష్ సింగ్ ‘హు కిల్డ్ శ్రద్ధ వాకర్’ పేరును ఈ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ముంబైకి చెందిన శ్రద్ధ వాకర్, అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరి ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ ఉన్నారు. కాగా కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో శ్రద్ద వాకర్‌ను అఫ్తాబ్ అతికిరాతకంగా 35 ముక్కులుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఆరు నెలల తర్వాత బయటపడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఉదంతాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు డైరెక్టర్ మనీష్ సింగ్ వెల్లడించారు. బృందావన్ ఫిల్మ్స్ బ్యా నర్ పై ‘హు కిల్డ్ శ్రద్ధ వాకర్’ పేరుతో సినిమాను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రేమ ముసుగులో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, శారీరక అవసరం తీరాక కొంతమంది అబ్బాయిలు సైకోలుగా ఎలా మారుతున్నారనే కోణంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు మనీష్ సింగ్ చెప్పారు.
ఇదీ చదవండి: పవర్ రేంజర్స్ నటుడు మృతి.. ఆత్మహత్య చేసుకున్న గ్రీన్ రేంజర్