London: లండన్‌లో స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ
లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
London: లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి. ఉద్యోగుల సమ్మెతో వివిధ ప్రాంతాల నుంచి లండన్‌కు రావాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ధరలు చుక్కలనంటాయి. దేశంలోని పారిశ్రామికరంగంలో పనిచేసే కార్మికులు ఇటీవలే వేతనాలు పెంచాలని సమ్మెకు దిగారు. అటు తర్వాత వివిధ రంగాలకు చెందిన కార్మికులు కూడా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి సరసన అండర్ గ్రౌండ్ రైల్వే సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ వారం ద్రవ్యోల్బణం దాదాపు 10 శాతానికి ఎగబాకింది. దీంతో బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలకు వేతనాలు మధ్య పొంతన కుదరడం లేదు.
బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇతర యూరోపియన్ దేశాలు, అమెరికాతో పోల్చుకుంటే బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం బ్రిటన్‌పై దారుణంగా పడింది. పెరిగిపోతున్న ఇంధన ధరలతో బ్రిటన్‌లోని పేదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిని తట్టుకునేందుకు ఇంటికి హీటింగ్ సిస్టమ్ బిల్లు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు ఒంటిపూట కడుపు నింపుకొని గ్యాస్ బిల్లులు చెల్లించాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్ స్పందించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్ సమ్మెను తాను సమర్ధించనని, అదే సమయంలో రవాణా కార్మికుల ఇబ్బందులను తాను అర్దం చేసుకోగలనని అన్నారు. కష్టపడి పనిచేసే రైల్వే కార్మికులను సమ్మె పేరుతో శిక్ష రాదని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రిషి సునాక్ కానీ, లిజ్ ట్రస్‌కు తాజా పరిణామాల నుంచి గట్టెక్కించడం అతి పెద్ద సవాలుగా బ్రిటన్ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.