Tollywood: సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రభాస్ @ 20 ఇయర్స్
ఆ నటుడి ఎంట్రీ సాధరణమే. నటించిన చిత్రాల విజయాలు కూడా తక్కువే. కాని, విజయ చక్రాలెక్కిన ఆ చిత్రలే అతడిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మద్య ఠీవిగా నిలబడేలా చేసింది. బాహుబలి హీరోగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అతగాడే ఆరడుగుల ఆజానుబాహుల ప్రభాస్
Prabas @ 20 Years: ఆ నటుడి ఎంట్రీ సాధరణమే. నటించిన చిత్రాల విజయాలు కూడా తక్కువే. కాని, విజయ చక్రాలెక్కిన ఆ చిత్రలే అతడిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మద్య ఠీవిగా నిలబడేలా చేసింది. బాహుబలి హీరోగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అతగాడే ఆరడుగుల ఆజానుబాహుల ప్రభాస్. 2002, నవంబర్ 11న సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ నేటితో ఆయన చిత్రసీమలోని ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్ధాల అయిన క్రమంలో ప్రత్యేక కధనం…
దేవతామూర్తుల వేషధారణలో ప్రేక్షకులను మెప్పించే అభినవ నటుడిగా ప్రభాస్ తన స్థానాన్ని సుస్ధిరం చేసుకొన్నారు. ఆయన నటించిన తొలి సినిమా ఈశ్వర్ ఆ సినిమా విడుదలతో ప్రభాస్ కు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం వచ్చిన రాఘవేంద్ర ప్లాప్ అయింది. సిని రంగం ప్రవేశించిన వెంటనే పెద్దగా కమర్షియల్ హిట్ తెచ్చుకోక పోవడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో కొంత గందరగోళం ఏర్పడింది.
ఈ క్రమంలో వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ ఓ టర్నింగ్ గా మారింది. స్టార్ డం తెచ్చిపెట్టడమే కాకుండా మూవీ రిలీజ్ సమయంలో రూ. 18కోట్ల షేర్ ను సాధించింది. అనంతరం వచ్చిన అడవిరాముడు, చక్రం సినిమాలు తిరిగి ప్లాప్ లు అందుకొన్నాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజిని సంపాదించిపెట్టింది. కాని కమర్షియల్ గా ఆచిత్రంతోపాటు పౌర్ణమి, యోగి,మున్నా, బుజ్జిగాడు సినిమాలు కూడా ఫెయిలయ్యాయి.
ఇక్కడే ప్రభాస్ సినీ జీవితంలో భిల్లా మూవీ రిలీజ్ తో అనూహ్య టర్నింగ్ తోపాటు డాన్ చిత్రాలకు సరైన క్యారెక్టర్ హీరో ప్రభాస్ గా అందరి మన్ననలు అందుకొన్నాడు. విభన్న పాత్రల్లో ప్రేక్షకులను ఫిదా చేశాడు. స్టైలిష్ డాన్ గా బెంచ్ మార్క్ అందుకొన్నాడు. అనంతరం వచ్చిన సినిమా ఏక్ నిరంజన్ కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయింది. అయితే మిర్చి మూవీలో ప్రభాస్ లుక్స్ గాని, పర్ఫార్మెన్స్ గాని వేరే లెవల్లో ఉండడంతో ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ డ్రెస్సింగ్ ట్రెండింగ్‌లో ఉండేది.
అనంతరం వచ్చిన చిత్రంతో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇండియాలోనే తొలి పాన్ ఇండియా హీరోగా రికార్డు సృష్టించాడు. బాహుబలి తో టాలీవుడ్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. అప్పటి వరకు నార్త్‌లో తెలుగు సినిమాలకు అంతగా క్రేజ్ ఉండేది కాదు. బాహుబలితో ఒక్క సారిగా నార్త్‌లో సౌత్ సినిమాల సత్తా ఎంటో నిరూపణ అయింది. ఇక ఇదే జోరులో మరో రెండేళ్లుకు బాహుబలి-2 ను రిలీజ్ చేశాడు. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచాడు. రాజమౌళి అద్భుత డైరెక్షన్‌కు, ప్రభాస్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా నార్త్‌లో ప్రభాస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అనే ఒక నమ్మకం టాలీవుడ్లో ఉంది. అయితే దాన్ని ప్రభాస్ సాహోతో బ్రేక్ చేశాడు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో హిట్టు కాలేకపోయినా, బాలీవుడ్లో మాత్రం ఘన విజయం సాధించింది. ప్రభాస్ క్రేజ్ ముందు ఖాన్, కపూర్ల సినిమాలు నిలవలేకపోయాయి. ఫ్లాప్ టాక్‌తోనే రూ.450 కోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
అనంతరం ప్రభాస్ నటించిన మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా విడుదల నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ సినిమా ఫలితం ప్రభాస్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్ని ఆదిపురుష్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా విడుదల అప్పుడు ఇప్పుడు అంటూ ప్రేక్షకులను ఊరిస్తూ పోస్ట్ పోన్ అవుతుంది.
ప్రభాస్ 20ఏళ్ల సిని ప్రస్థానంలో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. క్రేజ్‌లో మాత్రం ప్రభాస్‌కు పోటీలేదు. ఇండియాలోనే అత్యధిక రెమ్యనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. విజయాలు-అపజయాలు ఎప్పుడూ పక్క పక్కనే ఉంటాయి. ఏది ఏమైనా యాక్షన్, డాన్, రెబల్ స్టార్ హీరో ప్రభాస్ తన సినీ జీవితంలో మరింత ఎత్తుగా ఎదగాలని అందరం ఆశిద్ధాం…
ఇది కూడా చదవండి: Allu Arjun financial support for Kerala student: కేరళ విద్యార్ధినికి నటుడు అల్లు అర్జున్ ఆర్ధిక చేయూత…వెల్లడించిన అలెప్పీ కలెక్టర్