Gutha Sukender Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు.. గుత్తా సుఖేందర్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Hyderabad: మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల పై బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా నష్ట పోయారన్నారు. పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
లౌకిక వాదులు గెలిచారని, బిజెపి నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారన్నారు. మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులకు చెంప పెట్టులా మునుగోడు తీర్పు వచ్చిందన్నారు. మునుగోడు ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడించాయని, తెలంగాణలో విచ్చిన్నకర శక్తులకు స్థానం లేదని మరోసారి రుజువైందన్నారు. దేశానికి మార్గదర్శకంగా ఉండేలా రాజకీయం చేయాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని, మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టు అని గుత్తా తెలిపారు. తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని స్పష్టమైందని అన్నారు.
ఈ ఎన్నికల్లో కేంద్రం ఇన్ కంటాక్స్ డిపార్టుమెంట్ ను కూడా వాడిందని ఆయన మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అవసరం చాలా ఉందని, సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేసీఆర్ పాటుపడతున్నారన్నారు. కేసీఆర్ పై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందని, అన్ని రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుత్తా ప్రశంసించారు.