Senior IAS Y Srilakshmi: ఓఎంసీ మైనింగ్ కేసు.. ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి భారీ ఊరట
తెలంగాణ హైకోర్టులో ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మీకి భారీ ఊరట లభించింది. ఓబులాపురం గనుల కేసులో ఆమెపై నమోదైన అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో (2004-2009) ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
Hyderabad: తెలంగాణ హైకోర్టులో ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మీకి భారీ ఊరట లభించింది. ఓబులాపురం గనుల కేసులో ఆమె పై నమోదైన అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో (2004-2009) ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
ఆ సమయంలో ఓఎంసీకి గనుల కేటాయింపు పై జీవో, నోటిఫికేషన్ విషయంలో అధికార దుర్వినియోగానకి పాల్పడ్డారని, గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు. సీబీఐ అభియోగాల పై తగిన ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. అదే కేసులో ఆమె కొద్ది నెలల పాటు జైలులో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఏపీ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్