Immigration Check: సీపీఐ నారాయణకు ఫ్లోరిడాలో చేదు అనుభవం
ఫ్లోరిడాలో కమ్యూనిస్ట్ నేత సీపీఐ కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మియామి విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో ఆయన్ను మూడు గంటల పాటు వేధించారు.
CPI Narayana: ఫ్లోరిడాలో కమ్యూనిస్ట్ నేత సీపీఐ కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మియామి విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో ఆయన్ను మూడు గంటల పాటు వేధించారు.
క్యూబాలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్ట్, కార్మికుల సదస్సుకు నారాయణ హాజరైనారు. అనంతరం అక్కడి నుండి ఫ్లోరిడా నుండి పెరూలో ఉన్న తన మనవడిని చూసేందుకు వెళ్లుతుండగా మియామి విమానాశ్రయంలో అధికారులు నిలిపివేశారు. నారాయణను వివిధ ప్రశ్నలతో విసిగించారు. అధికారుల విచారణవల్ల సమయం వృధా కావడంతో పెరూ వెళ్లాల్సిన విమానం నారాయణకు తప్పింది. దీంతో విచారణ అనంతరం మరో విమానంలో పెరూకు ఆయన చేరుకొన్నారు.
ఇది కూడా చదవండి: Shakib Al Hasan: భారత్ ను ఓడించడానికే ఇక్కడకు వచ్చాం.. బంగ్లా కెప్టెన్ షకీబ్