Dewald Brevis: బ్యాటుతో విధ్వంసం.. 50 బంతుల్లో 150 పరుగులు
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ సన్సేషన్ సృష్టించాడు. బ్యాటుతో పెను మైదానంలో పెను విధ్వంసానికి తెరతీశాడు. CSA T20 ఛాలెంజ్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన ఆల్ రౌండర్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు.
Dewald Brevis: దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ సన్సేషన్ సృష్టించాడు. బ్యాటుతో పెను మైదానంలో పెను విధ్వంసానికి తెరతీశాడు. CSA T20 ఛాలెంజ్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన ఆల్ రౌండర్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు.
19 ఏళ్ల బ్రెవిస్ మైదానంలో పరుగుల వరద సృష్టించాడు. కేవలం 52 బంతుల్లో 150పైగా పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. బేబీ ఏబీగా పిలవబడే బ్రెవిస్ ఈ మ్యాచ్‌లో 162(57) పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. 35 బంతుల్లోనే 100 కొట్టి 162 రన్స్ వద్ద బ్రెవిస్ అవుట్ అయ్యాడు. గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును ఈ బేబీ ఏబీ బద్దలు కొట్టాడు. ఇకపోతే భారత్ లో జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్ అయిన ఐపీఎల్ లో బ్రెవిస్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో సెమీస్ ఛాన్స్ ఏఏ జట్లకంటే..?