Minister Roja: ముదిరిన వర్గపోరు.. జగన్ కు మొరపెట్టుకొన్న మంత్రి రోజా
మంత్రి రోజా ఇలాకాలో వర్గపోరు ముదిరిపాకాన పడింది. పార్టీలో కీలక నేతలు రెండుగా విడిపోయారు. పోటా పోటీ కార్యక్రమంలో రోజమ్మకు నిద్రలేకుండా చేస్తున్నారు. విసిగివేశారిన మంత్రి రోజా ఇక మహాప్రభు నువ్వే దిక్కంటూ జగన్ కు ప్రత్యర్ధి వర్గంపై ఫిర్యాదు చేశారు. దీంతో నగరి వైసిపి పార్టీలోని అంతర్గత పోరు మరోమారు బయటపడింది.
Nagari: మంత్రి రోజా ఇలాకాలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. పార్టీలో కీలక నేతలు రెండుగా విడిపోయారు. పోటా పోటీ కార్యక్రమంలో రోజమ్మకు నిద్రలేకుండా చేస్తున్నారు. విసిగివేశారిన మంత్రి రోజా ఇక మహాప్రభు నువ్వే దిక్కంటూ జగన్ కు ప్రత్యర్ధి వర్గం పై ఫిర్యాదు చేశారు. దీంతో నగరి వైసిపి పార్టీలోని అంతర్గత పోరు మరోమారు బయటపడింది.
చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో ఉంచుకొనేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టి ప్లానే వేస్తున్నారు. జిల్లాలో ప్రాధాన్యత ఉన్న కీలక నేతలన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకొనేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా ఇలాకాలో తను కాలుపెట్టకుండా ఆమె పై ప్రత్యర్ధులను ఉసిగొల్పుతున్నారు. పెద్దిరెడ్డి అండతో పలువురు నగరి నేతలు మంత్రి రోజాను పట్టించుకోవడం లేదు. సరికదా ప్రతిపక్ష పార్టీకి చెందిన మంత్రిగా భావిస్తూ రోజాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వివాదాలను సృష్టించి ఆమెను అభాసుపాలు చేస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాతో సంబంధం లేకుండా ఆర్బీకే, వెల్ నెస్ కేంద్రానికి ప్రత్యర్ధి వర్గానికి చెందిన నేతలే భూమిపూజ చేశారు. దీనిపై రోజా తీవ్ర కలతచెందారు. మంత్రిగా వ్యవహరిస్తున్న తన నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం నేతలు తీరు పై ఆవేదన చెందుతూ ఆమె విడుదల చేసిన ఓ ఆడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ అయింది.
దీంతో రోజా స్వయంగా తాడేపల్లికి చేరుకొని సీఎం జగన్ కు ఫిర్యాదు చేయడంతో నగరి రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. రోజా వ్యతిరేక వర్గంలో రెడ్డివారి చక్రపాణి రెడ్డి, మురళీధర రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్, ఏలుమలై, లక్ష్మీపతిరాజులను ఎన్నికల అనంతరం మంత్రి రోజా దూరం పెట్టడంతో పెద్దిరెడ్డి వారిని చేరదీసి, పదవులు కట్టబెట్టి చిత్తూరు జిల్లాలో తన హవాను చూపించకనే చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: MLA Maddisetty Venugopal: రాష్ట్ర ప్రభుత్వం పై దర్శి వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్..