Kantara: “కాంతార” మూవీకి కాపీరైట్ ఇష్యూ..!
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది.
Kantara: ‘కాంతార’ ఇటీవల ఈ పేరు తెలియని వారుండరు. ఈ కన్నడ మూవీ అనేక భాషల్లో డబ్ అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. తెలుగు తమిళ కన్నడ వంటి పలు భాషల్లో ఈ మూవీ భారీ వసూళ్లను సొంతం చేసుకుంటున్నది. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. అంతలా ఈ మూవీ ప్రజల అభిమానాన్ని కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాలోని ‘వరాహరూపం దైవ వరిష్టం’అనే పాట భక్తిభావాలతో థియేటర్లలో చూసే ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేస్తుంది. కాగా ఈ పాటను కాపీ కొట్టారంటూ ఓ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది.
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది. తమ అనుమతి లేకుండా ట్యూన్‌ను వాడుకోవడం ఏంటని, కాపీరైట్ చట్టాన్ని కాంతార టీం ఉల్లఘించిందని తెలిపింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. తమ బృందానికి మద్దతు నెటిజన్లు మద్దతు ఇవ్వాలని కోరారు. వరాహరూపం.. పాట విషయంలో కోర్టుకు వెళ్తామని, పాటను స్ఫూర్తిగా తీసుకోవడం వేరు, కాపీ కొట్టడం వేరు అని తెలిపారు. కాపీ కొట్టడం తప్పని ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు తాము సిద్ధమవుతున్నామని థాయికుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై ‘కాంతార’మూవీ టీం స్పందించలేదు.
ఇదీ చదవండి: కాంతార @ రూ.188 కోట్లు