Last Updated:

Chandrakanthalu Recipe: చంద్రకాంతలు ఇలా తయారు చేసుకోవాలి..

శ్రావణమాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు, పండుగలు మొదలవుతాయి. ఈ సందర్బంగా పలు రకాల పిండివంటలను, నైవేద్యాలను తయారు చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే స్వీట్స్ విషయానికొస్తే ఎప్పుడు తినేవి కాకుండా కొత్త రకాలను ట్రై చేయాలని పలువురు భావిస్తారు.

Chandrakanthalu Recipe: చంద్రకాంతలు ఇలా తయారు చేసుకోవాలి..

Chandrakanthalu Recipe: శ్రావణమాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు, పండుగలు మొదలవుతాయి. ఈ సందర్బంగా పలు రకాల పిండివంటలను, నైవేద్యాలను తయారు చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే స్వీట్స్ విషయానికొస్తే ఎప్పుడు తినేవి కాకుండా కొత్త రకాలను ట్రై చేయాలని పలువురు భావిస్తారు. అయితే సమయం లేకపోవడం, ఎలా చేయాలో తెలియకపోవడం జరుగుతుంది. ఇలాంటివారికోసం పెసరపప్పుతో తయారు చేసే చంద్రకాంతలను పరిచయం చేస్తున్నాము.

చంద్రకాంతలు తయారీకి కావాల్సిన పదార్ధాలు..
పెసరపప్పు – 1 కప్పు
పంచదార – 1 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుము – 1/2 కప్పు
జీడిపప్పు – 1/2 కప్పు
యాలకుల పొడి – 1 స్పూన్
నూనె – సరిపడ

తయారు చేయు విధానంముందుగ పెసరపప్పును గంట పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్ళు కలిపి కొంచం పలచగా చేసుకోవాలి. మందపాటి పాత్రలో పంచదార, రుబ్బిన పెసరపప్పు మిశ్రమం తురిమిన కొబ్బరి, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ పాత్రను సన్నని సెగపై ఉంచి పంచదార కరిగి తీపాకం వచ్చే వరకూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పెసరపప్పు మిశ్రమం కొద్దిగా గట్టిపడ్డాక యాలకుల పొడి వేసి కలిపి దించెయ్యాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తడిగుడ్డపై పోసి కాస్త మందంగా ఉండేట్టుగా సమానంగా చేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత చంద్రకారంలో కానీ మనకు ఇష్టమైన ఆకారంలో కానీ ముక్కలుగా కట్ చేసుకోవాలి.చివరగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక కట్ చేసిన పెట్టుకొన్న ముక్కల్ని అందులో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీయాలి అంతే చంద్రకాంతలు రెడీ. ఇవి తియ్యగా రుచిగా ఉంటాయి. అన్ని వయసులవారికీ నచ్చే స్వీట్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: