Last Updated:

KCR: టీఆర్ఎస్ చేరికల వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్

మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

KCR: టీఆర్ఎస్ చేరికల వెనుక కేసీఆర్ మాస్టర్  మైండ్

KCR: మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వరుసబెట్టి బీజేపీ నుంచి ఆ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడం వెనక కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

ఢిల్లీకి వెళ్లి 10 రోజుల పాటు ఏం చేశారో తెలియదు కానీ.. హైదరాబాద్ రాగానే తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్నారు సీఎం కేసీఆర్. తన పాత తప్పులన్నీ సరిదిద్దుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఉద్యమకారులందరినీ తిరిగి తనే స్వయంగా ఫోన్లు చేసి మరీ రప్పించి వారి రాజకీయ భవిష్యత్ పై హామీలిస్తున్నారు. దీంతో వరుసబెట్టి బీజేపీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు.బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్‌ – టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కారెక్కేశారు. .టీఆర్ఎస్ లోనే ఉద్యమకారుడిగా రాజకీయం మొదలుపెట్టారు శ్రవణ్. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. కొన్నాళ్లకు బీజేపీలో చేరారు శ్రవణ్‌. తాజాగా మళ్లీ సొంతగూటికే తిరిగొచ్చారు. బీజేపీలో చేరి కనీసం రెండు నెలలు కాకముందే ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రవణ్‌కు భువనగిరి ఎంపీ సీటు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల మునుగోడు సీటు కోసం భువనగిరి మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ఎంతో ప్రయత్నించారు. ఆ సీటు ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు భువనగిరి ఎంపీ సీటు కోసమే శ్రవణ్ టీఆర్ఎస్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఇక.. టీఆర్ఎస్ నుంచి వెళ్లిన మరో ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌కు కూడా కేసీఆర్‌ ఫోన్ చేశారు. కేసీఆర్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా వేధించాడని.. ఏ పోస్టు ఇవ్వలేదని మనస్థాపం చెందిన టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు స్వామిగౌడ్. అయితే – స్వామిగౌడ్‌కు కూడా భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు టాక్‌ నడుస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని, అది తనకు బాధ కల్గించిందని స్వామిగౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీల పట్ల ఆ పార్టీ తీరు ఆక్షేపణీయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే 2020లో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు.

ఒకే రోజు ఇద్దరు బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరడం వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, జితేందర్ రెడ్డి లాంటి వారికి కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి కలిసి తిరిగి పనిచేద్దాం అని పిలుపునిచ్చినట్టు తెలిసింది. దీంతో వారందరూ మనసు మార్చుకొని తిరిగి టీఆర్ఎస్ లో చేరేందుకు ఓకే అన్నారు. దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ మొదట ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే జితేందర్ రెడ్డి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కేసీఆర్‌ ఆహ్వానించినా ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తేలేదని మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు విఠల్‌ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ వార్తలను వారు ఖండించారు.

బీజేపీని ఓడించాలంటే మంచి బలమైన నేతలు.. బలమైన వాయిస్ ఉన్న వ్యక్తుల అవసరం టీఆర్ఎస్‌కు కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే ఆయన తిరిగి ఉద్యమకారులకే పట్టం కట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరిన ఉద్యమకారులకు ఫోన్లు చేసి మరీ తిరిగి కారెక్కిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి గట్టి షాక్ ఇవ్వగా, టీఆర్ఎస్‌లో జోష్ నెలకొంది.ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. తన వైఖరితో టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు బీజేపీకి వెళ్లారు.. ఇప్పుడు వారినే తన చెంతకు చేర్చుకున్నారు. ఒక మెట్టు వెనక్కి జరిగి.. తప్పును తెలుసుకొని వలసపోయిన ఉద్యమకారులకు స్వయంగా కేసీఆర్ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ అంతటి వ్యక్తి ఫోన్లు చేయడంతో పోయిన నేతలంతా తిరిగి వస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: