Asaduddin Owaisi: ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడకూడదు.. అసదుద్దీన్ ఒవైసీ
మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు.
Asaduddin Owaisi: మెల్బోర్న్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని నిర్ణయించనప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని ఒవైసీ శుక్రవారం అన్నారు. శనివారం మజ్లిస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. ఇప్పుడు రేపు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? మన జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదు, ఆస్ట్రేలియాలో మాత్రం వారితో ఆడతాం.. పాకిస్థాన్‌తో ఆడకపోతే ఏమవుతుంది? 2,000 కోట్ల రూపాయల నష్టం? అయితే భారతదేశం కంటే ఈ డబ్బు ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి అంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు
ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జే షా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసారు. అక్టోబర్ 23న జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ విజయానికి మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే జట్టులో ఉన్న ముస్లిం ఆటగాళ్లను ట్రోల్ చేస్తారని అన్నాడు. భారత్ ఓడిపోతే ట్రోలర్లు ఎవరి తప్పు అని వెతకడం ప్రారంభిస్తారని ఒవైసీ అన్నారు. మా హిజాబ్, గడ్డం మరియు ఇప్పుడు క్రికెట్‌తో మీకు సమస్య ఉంది, ఇది క్రికెట్ ఆట, గెలుపు ఓటములు రెండూ ఉన్నాయి అని ఒవైసీ దుయ్యబట్టారు.
2021లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌తో సహా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత, మెల్బోర్న్లో జరిగే మ్యాచ్‌పై భారత క్రికెట్ జట్టు మరియు కెప్టెన్ రోహిత్ శర్మపై చాలా ఒత్తిడి ఉంది. ప్రపంచకప్ టోర్నీని భారత్ విజయంతో ప్రారంభిస్తే.. భారత్‌కు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.