Munugodu: మునుగోడు ఉప ఎన్నిక… టిఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది
Munugodu: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది.టీఆర్ఎస్ నేతలు 300 మందిని యాదాద్రికి తీసుకువెళ్లి ప్రమాణం చేయించారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికలసంఘం స్పందించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ని అధికారంతో గుర్తు మార్చి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథ రావును తప్పించి రోహిత్ సింగ్ ను నియమించారు.ఈవీఎం బ్యాలెట్‌లో బోటు గుర్తుకు బదులు మరో గుర్తు ముద్రించిన చౌటుప్పల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు పడింది.