PM Modi: చోలా దొరను ధరించి కేథారనాథుడిని దర్శించిన మోది
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్‌కు హారతి ఇచ్చారు.
PM Modi: 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా కేదార్‌కు హారతి ఇచ్చారు. ఉదయం 8.30 గంటలకు కేథారనాథ్ చేరుకున్న ఆయన అనంతరం అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్ అయిన చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. తదనంతరం గౌరికుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం మోదీ బద్రీనాథ్ కూడా వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
#WATCH | PM Narendra Modi performs ‘puja’ at the Kedarnath Dham
(Source: DD) pic.twitter.com/9i9UkQ5jgr
— ANI (@ANI) October 21, 2022
ఇదీ చదవండి: ఎంత దారుణం.. ప్లాస్మాకు బదులుగా బత్తాయిరసం ఎక్కించారు