Suicide: పోలీస్ స్టేషన్ లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్.. అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య
పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయినారు. ఇంతలో హఠాత్తుగా ఆ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొనింది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకొనింది.
Vizag: వారిద్దరు నవ దంపతులు. వివాహం జరిగి నాలుగు నెలలు కూడా కాలేదు. ఇంతలో కుటుంబంలో ఘర్షణలు. వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్ కు చేరింది. పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయినారు. ఇంతలో హఠాత్తుగా ఆ వివాహిత క్షణికావేశానికిలోనై ఆత్మహత్య చేసుకొనింది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకొనింది.
పోలీసుల సమాచారం ప్రకారం, గుంటూరుకు చెందిన శ్రావణి (30)కి విశాఖకు చెందిన వినయ్ తో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఆనాటి నుండి వారి వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమైనాయి. ఈ క్రమంలో భార్యభర్తల మద్య ఏర్పడిన ఘర్షణతో భార్య శ్రావణి నిన్నటిదినం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నేడు ఎస్సై శ్రీనివాస్ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిన శ్రావణి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. భర్తను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, జరిగిన సమాచారాన్ని శ్రావణి కుటుంబసభ్యులకు చేరవేశారు. ఘటన పై ధిగ్భ్రాంతి చెందిన డీసీపీ సుమిత్ సునీల్, ఏసీపి మూర్తి, సీఐ ప్రసాదులు విచారణ చేపట్టారు.