Last Updated:

Bengaluru: బెంగళూరును మరోసారి ముంచెత్తిన వరద

గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.

Bengaluru: బెంగళూరును మరోసారి ముంచెత్తిన వరద

Bengaluru: గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీరుచేరడంతో వాహనాలు పాడైపోయాయి. ఐటీ క్యాపిటల్‌లో బుధవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ సందర్భంగా ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమహల్‌ గుట్టహళ్లి ప్రాంతంలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, మరో మూడురోజులపాటు ఈ మహానగరంలో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో పాటు బెంగళూరుకి ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

గత నెల మొదటివారంలో బెంగళూరులో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల సిలికాన్‌ సిటీ జలమయంగా మారింది. భారీవర్షానికి నగరంలోని అన్నిప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులో సుమారు 1706 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా ఐటీ సిటీలో ఇంత భారీ మొత్తంలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో 2017లో 1696 మిల్లీమీటర్ల వర్షంపాతం కురిసింది.

ఇదీ చదవండి: ఈ రియల్ మోగ్లీని చూశారా.. ఈ విద్యార్థి కాలేజీకి ఎలా వెళ్తున్నాడో చూడండి..!

ఇవి కూడా చదవండి: