Last Updated:

Bandi Sanjay: కేంద్ర పధకాల పై కేసిఆర్ ప్రచారం చేయడం లేదు

కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay: కేంద్ర పధకాల పై కేసిఆర్ ప్రచారం చేయడం లేదు

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.

భూసార పరీక్షలకు మంజూరు చేసిన నిదులను తెరాస ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గుచేటని బండి సంజయ్ పేర్కొన్నారు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ. 3 వేలు పింఛన్ పథకాన్ని కేంద్రం మూడేళ్ల క్రితమే అంకురార్పణ చేసిందన్నారు. అయితే కేసీఆర్ సర్కారు దీనిపై రైతులకు అవగాహన కల్పించకపోవడం బాధాకరమన్నారు.

బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో కేసీఆర్ రైతుల నోట్లో మట్టి కొట్టడం సిగ్గు చేటని మండిపడ్డారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో భాగంగా తెలంగాలోని ప్రతి జిల్లాకు ఒక కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం కింద దేశంలోని 3.3 లక్షల ఎరువుల రిటైల్ దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చే ప్రణాళికకు అంకురార్పణ జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఒకే దేశం – ఒకే ఎరువుల విధానంలో భాగంగా భారత్ పేరుతో యూరియా బ్యాగ్‌లను ప్రధాని మోదీగారు ప్రారంభించడం సంతోషదాయకమని తెలిపారు.

ఇది కూడా చదవండి: Union Minister Kishan Reddy: అరచేతిలో బ్యాంకింగ్.. ఇదే డిజిటల్ బ్యాంకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇవి కూడా చదవండి: