Super Cyclone: ఏపీకి సూపర్ సైక్లోన్ హెచ్చరిక..!
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Super Cyclone: గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏపీకి సూపర్ సైక్లోన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ అల్పపీడనం కాస్త బలపడి తీవ్ర వాయుగుండంగా ఏపీ వైపు పయనిస్తుందని అంచనా వేస్తుంది. కాగా ఈ క్రమంలో తీవ్రవాయుగుండం.. తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ తుపాను గనుక ఏర్పడితే సిత్రాంగ్‌గా దానికి నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావం పడనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఉప్పెనలా “విశాఖ గర్జన”.. వికేంద్రీకరణే లక్ష్యంగా..!