Tamilisai: మరో వివాదంలో తమిళిసై.. భాజపా ఏజెంట్‌లా గవర్నర్ ప్రవర్తన..!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోల్ స్ట్రేటజీ 2024 ఫర్ సౌత్ స్టేట్స్ పేరుతో ట్విట్టర్ స్పేసెస్‌లో బీజేపీ ఓ మీటింగ్ను ఏర్పాటు చేసింది. కాగా ఆ సమావేశంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దానితో నెటిజన్లే కాక పలువురు రాజకీయ నేతలు తమిళిసైపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్. బీజేపీ ఎన్నికల వ్యూహ చర్చలో పాల్గొని బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఈ క్రమంలో తమిళిసై ఇలా పొలిటికల్ యాక్టివిటీలో భాగం కావడం మరి ఎన్ని వివాదాలకు తావిస్తోంది తెలియాలి.
ఇదీ చదవండి: తెరాసకు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ