Last Updated:

Visaka Garjana: ఉప్పెనలా “విశాఖ గర్జన”.. వికేంద్రీకరణే లక్ష్యంగా..!

వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.

Visaka Garjana: ఉప్పెనలా “విశాఖ గర్జన”.. వికేంద్రీకరణే లక్ష్యంగా..!

Visaka Garjana: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు. విశాఖలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగనుంది. మూడు రాజధానుల నినాదం ఈ ర్యాలీలో మారుమ్రోమగనుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాన్ని సైతం చేపట్టనున్నారు. జేఏసీ చేపడుతోన్న ఈ ర్యాలీకి పలువురు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే!

శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంద్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెప్తామని జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనాన్ని వివరిస్తూ ఈ ర్యాలీలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మూడు రాజధానులు, జాతీయ పతాకాలతో 50 మంది స్కేటర్లు ఈ ర్యాలీని లీడ్ చేయనుండగా, పలువురు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ముఖ్య నాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే విశాఖకు పలువురు మంత్రులు చేరుకున్నారు. కాగా ఈ ర్యాలీ ముగిసిన అనంతరం బీచ్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా ఈ విశాఖ గర్జన కోసం వెయ్యి మందికి పైగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ర్యాలీ కోసం వందలాది వాహనాల్లో ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పార్కింగ్ సదుపాల్ని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ కోసం విశాఖ రీజియన్ పరిధిలో 250 ఆర్టీసీ బస్సులు అద్దెకు వెళ్లాయి.

ఇకపోతే రాజధాని రైతుల ఉత్తరాంధ్ర పర్యటనకు ముందే ప్రజల్లో విశాఖ రాజధాని భావాన్ని బలంగా నెలకొల్పడానికి అధికార వైసీపీ ఎత్తుగడలు వేస్తుందంటూ ప్రతిపక్షపార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖ గర్జనకు, వైకాపాకు సంబంధం లేదు.. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ

ఇవి కూడా చదవండి: