TS High Court: మునుగోడులో కొత్త ఓటర్ల ప్రక్రియ పెండింగ్ లో ఉంచండి.. తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధమైన మునుగోడులో కొత్త ఓటర్లను వేల సంఖ్యలో నమోదు చేసుకొనేలా అధికార పార్టీ ప్రయత్నించిందని, కోర్టు మెట్లెక్కిన భాజపా నేతలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్గించింది.
Hyderabad: తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధమైన మునుగోడులో కొత్త ఓటర్లను వేల సంఖ్యలో నమోదు చేసుకొనేలా అధికార పార్టీ ప్రయత్నించిందని, కోర్టు మెట్లెక్కిన భాజపా నేతలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్గించింది. పెండింగ్ లో ఉన్న ఓటర్ల జాబితా నిలిపేయాలని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కొత్త ఓటర్లు క్యూ కట్టారు. దీంతో అనూహ్యంగా 25వేల కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘానికి దరఖాస్తులు చేసుకొన్నారు. అయితే ఏ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్ధితి లేదని, కేవలం అధికార పార్టీ వేసిన పన్నాగంలోనే కొత్త ఓటర్లు, వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకొన్నారని భాజపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసం విచారణ చేపట్టింది.
కొత్త ఓటర్ల దరఖాస్తుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించింది. 25 వేల ఓట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని, మరో 7 వేల ఓట్లు నమోదును తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న ఓటర్లు ప్రక్రియను నిలిపేయాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్‌లో ఉన్న ఓటరు జాబితా నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా వేసింది.
కోర్టు తీర్పును రాష్ట్ర భాజపా నేతలు స్వాగతించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రను అడ్డుకున్నామన్నారు. ఉప ఎన్నికలో 25వేల ఓట్లను ఒకేసారి డంపు చేయాలని టీఆఅర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఓటర్లుగా నమోదు చేయించారని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందన్నారు. బీజేపీ అడ్డుకోకుంటే, 25 వేల బోగస్ ఓట్లు నమోదు అయ్యేవని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పు పై టీఆర్ఎస్ నేతల నుండి స్పందన కరువైంది.
ఇది కూడా చదవండి: మునుగోడు ఓటర్ల నమోదు పై భాజపా పిటిషన్