Last Updated:

Maharashtra: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్‌ తక్‌ అనే కాలాన్ని సంజయ్‌ రౌత్‌ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్‌ కాలం ప్రచురితమైంది.

Maharashtra: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌

Maharashtra: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ఈడీ సీరియస్‌ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్‌ తక్‌ అనే కాలాన్ని సంజయ్‌ రౌత్‌ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్‌ కాలం ప్రచురితమైంది. దీనిపై ఈడీ విచారణకు మొదలుపెట్టింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం ఈడీ కస్టడీలో ఉన్న రౌత్‌ చట్టం ప్రకారం పత్రికకు కాలం రాసే హక్కును కోల్పోతారు. అయితే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందిన తర్వాత కాలమ్‌ రాసే అవకాశం ఉంటుందని ఈడీ వివరించింది.

ఆదివారం ప్రచురితమైన సామ్నా పత్రికలో రౌత్‌ గవర్నర్‌ బీఎస్‌ కోశియారీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల కోశియారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ముంబై నుంచి గుజరాతీలు, రాజస్థానీలు తరలిపోతే ముంబై భారత దేశ ఆర్థిక రాజధాని హోదా కోల్పోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో గవర్నర్‌ కోశియారీ క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే మహారాష్ట్ర ప్రజలు సరైన తీరులో బుద్దిచెబుతారన్నారు రౌత్‌. రౌత్‌ అరెస్టు తర్వాత రోజే కోశియారీ క్షమాపణలు చెప్పారు.

ఇదే సామ్నా కాలమ్‌లో రౌత్‌ ఈడీ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మఠాటీ ప్రజలకు చెందిన చక్కెర ఫ్యాక్టరీలు, టెక్స్‌టైల్స్‌ మిల్స్‌తో పాటు ఇతర పరిశ్రమలపై అక్రమ కేసులు పెట్టి మూసి వేయిస్తున్నారని తన కాలమ్‌లో మండిపడ్డారు రౌత్‌. దీని గురించి కూడా గవర్నర్‌ గళం విప్పాల్సిందన్నారు. అయితే ఆదివారం ప్రచురిమైన రౌత్‌ కాలాన్ని సామ్నా సిబ్బందే రౌత్‌ బై లైన్‌ ఫోటోతో ప్రచురించారని శివసేన నాయకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా పాత్రా చావల్‌ కేసుకు సంబంధించి ముంబై స్పషల్‌ పీఎంఎల్‌ఏ కోర్టులో సంజయ్‌ రౌత్‌కు చుక్కెదురైంది. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌ను మరో 14 రోజుల జుడిషియల్‌ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 22 వరకు ఆయన ఆర్ధర్‌ రోడ్‌ జైలులో గడపాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇదే జైలులో ఎన్‌సీపి ఎమ్మెల్యేలు నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ ముఖ్‌లు శిక్ష అనుభవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: