Hawala Racket : హైదరాబాద్ లో రూ.900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ లో రూ.900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది.
Hawala Racket : హైదరాబాద్ లో రూ.900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది. తైవాన్ కు చెందిన చున్యూ, చైనాకు చెందిన లేక్ లు కీలక సూత్రధారులని పోలీసులు గుర్తించారు. నగరంలో భారీగా బాధితులు ఉన్నారని..కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంతే కాకుండా హవాలా డబ్బును విదేశాలకు తరలించినట్టు గుర్తించామని.. ఈ మోసాన్ని ఈడీ సైతం గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేస్తే.. ఈ హవాలా వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఇందులో చైనా దేశస్థుడు జాక్ హస్తం ఉన్నట్టు గుర్తించామని.. ఈ మోసంపై ఈడీ, డీఆర్ఐ అధికారులను దర్యాప్తు చేయాలని కోరతామని ఆయన చెప్పుకొచ్చారు.
నిందితులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఎలాంటి రికార్డులు లేకుండానే వర్చువల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని తెలిపారు. దేశం నుండి వందల కోట్లను చైనాకు తరలించినట్టుగా గుర్తించినట్టుగా ఆనంద్ తెలిపారు