Pawan Kalyan: విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి.. తెలంగాణ సర్కారుకు పవన్ లేఖ
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు అండగా నిలబడాల్సిన బాధ్యతను నటుడు పవన్ కల్యాణ్ తీసుకొన్నారు. విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి అంటూ జనసేన అధినేత తెలంగాణ సర్కారుకు లేఖ వ్రాసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ మంత్రి కేటిఆర్, ఆర్టీసి ఎండి సజ్జనార్, సీఎంవో తెలంగాణకు జత చేస్తూ పోస్టు చేశారు
Hyderabad: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు అండగా నిలబడాల్సిన బాధ్యతను నటుడు పవన్ కల్యాణ్ తీసుకొన్నారు. విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి అంటూ జనసేన అధినేత తెలంగాణ సర్కారుకు లేఖ వ్రాసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ మంత్రి కేటిఆర్, ఆర్టీసి ఎండి సజ్జనార్, సీఎంవో తెలంగాణకు జత చేస్తూ పోస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్ధులకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్లి చదువుకొంటున్న విద్యార్ధులను అటవీ ప్రాంత సమస్య వెంటాడుతుందన్నారు. అడవి మార్గంలో నడిచి వెళ్లాల్సిన భయంతో విద్యనభ్యసించలేకపోతున్నారని పేర్కొన్నారు. విద్యా సంస్ధల నుండి తమ స్వస్థాలలకు వెళ్లే సమయంలో నడకదారిన వెళ్లే పరిస్ధితి నేడు ఉందన్నారు.
ఆర్టీసీ బస్సు సదుపాయాలను సక్రమంగా నడపకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. తరచూ సర్వీసులను రద్దు చేస్తూ విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారు, ఆర్టీసి అధికారులు స్పందించి విద్యార్ధుల సమస్యను తొలగిస్తూ బస్సును ప్రత్యేకంగా నడపాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. సదుపాయాలు, అటవీ ప్రాంత భయంతో చిన్నారుల విద్యా దశ మద్యలోనే ఆగిపోకూడదని పవన్ ఆశించారు.
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి: ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC @KTRoffice @TelanganaCMO @tsrtcmdoffice pic.twitter.com/ZRrnXTpLeg— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022