Hawala money seized: రూ.3.5 కోట్ల హవాలా నగదు పట్టివేత
హవాలా నగదుకు లావాదేవీలకు దొంగ మార్గం. దీన్ని నిరోధించేందుకు నిత్యం ప్రభుత్వ వర్గాలు శ్రమిస్తుంటాయి. అయినా దొడ్డిదారిన హవాలా చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులో రూ. 3.5 కోట్ల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు
Hyderabad: హవాలా నగదుకు లావాదేవీలకు ఓ దొంగ మార్గం. దీన్ని నిరోధించేందుకు నిత్యం ప్రభుత్వ వర్గాలు శ్రమిస్తుంటాయి. అయినా దొడ్డిదారిన హవాలా చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులో రూ. 3.5 కోట్ల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
సమాచారం మేరకు, గాంధీనగర్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు భారీగా హవాలా నగదును తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో మారియట్ హోటల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో వారికి రూ. 3.50 కోట్ల నగదు పట్టుబడింది. గండి సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తికి వెంకటేశ్వర్ అనే మరో వ్యక్తి రూ. 3.5కోట్ల నగదు ఇచ్చిన్నట్లు గుర్తించారు. నగదును సైదాబాద్ లో నివాసం ఉన్న బాలు, మహేందర్లకు ఇవ్వాలని సూచించి ఉన్నాడు.
పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 7 సెల్ ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేశారు. పోలీసుల అదుపులో సాయికుమార్, మహేశ్, సందీప్, మహేందర్, అనూష్, భరత్ లు ఉన్నారు. ప్రాధమిక విచారణలో పట్టుబడ్డ వ్యక్తుల నుండి సరైన సమాధానం పోలీసులు రాలేదు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకొన్నారు. ఆదాయపు పన్ను శాఖాధికారులకు పోలీసులు సమాచారం అందించారు.
ఇలా ఎన్నాళ్ల నుండి హవాలా సాగుతుంది. ఎవరు దీన్ని నడిపిస్తున్నారు. ఎంత మొత్తంలో రోజువారీ చేతులు మారుతుంది. దీని వెనుక ఎవరైనా రాజకీయ నేతలు, బడా బాబులు ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు