Mushroom Health Benefits: పుట్టగొడుగులు తింటే ఎన్నో ప్రయోజనాలు..
మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే పుట్టగొడుగులు తినడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. పుట్టగొడుగు అనేది ఒకరకమైన శిలీంధ్రం. మనకు అనేక రకాల పుట్టగొడుగులు లభించినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికి వస్తాయి. పుట్టగొడుగులను నేరుగా కూరగా చేసుకుని తినవచ్చు.
Mushroom Health Benefits: మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే పుట్టగొడుగులు తినడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. పుట్టగొడుగు అనేది ఒకరకమైన శిలీంధ్రం. మనకు అనేక రకాల పుట్టగొడుగులు లభించినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికి వస్తాయి. పుట్టగొడుగులను నేరుగా కూరగా చేసుకుని తినవచ్చు. ఎక్కువగా వీటిని వివిధ రకాల ఆహారపదార్థాల తయారీలో ఉపయోగిస్తారు పుట్టగొడుగుల్లో మన శరీరానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం వంటి మినరల్స్ తో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, కార్బొహైడ్రేట్స్ వంటి ఇతర పోషకాలు కూడా పుట్ట గొడుగుల్లో ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్త హీనత సమస్యను నయం చేయడంలో పుట్టగొడుగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. పుట్టగొడుగుల్లో ఎర్గోథియనీన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి మన శరీరంలో చెడు కణాలను తొలగిస్తాయి. అలాగే, శరీరానికి బయటి నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. తద్వారా మనకు త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పుడు విదేశీయులు పుట్టగొడుగులను డైలీ ఫుడ్ గా తీసుకుంటున్నారు. ఇవి కాస్త రేటు ఎక్కువ కాబట్టి, మన దేశంలో వారానికి ఒకసారి తింటున్నారు.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో, పలురకాల క్యాన్సర్ల బారిన పడకుండా చేయడంలో కూడా పుట్టగొడుగులు మనకు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. కనుక పుట్టగొడుగులను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.