Maruthi Temple: మారుతికి దేవాలయం.. వింత ఆచారానికి తెర లేపిన అన్నదాతలు
పంట చేనులో అశువులబాసిన ఆ జీవికి కర్మక్రియలు చేశారు. అన్నదాతలకు అన్నంపెట్టే ప్రదేశంలో చనిపోయిన ఆ మూగ జీవికి ఏకంగా గుడే కట్టేందుకు సిద్దమైతున్నారు ఆ గ్రామస్ధులు.
Mangalampadu: పంట చేనులో అశువులబాసిన ఆ జీవికి కర్మక్రియలు చేశారు. అన్నదాతలకు అన్నం పెట్టే ప్రదేశంలో చనిపోయిన ఆ మూగ జీవికి ఏకంగా గుడే కట్టేందుకు సిద్దమైతున్నారు ఆ గ్రామస్ధులు. కోతి నుండి మానవుడు జన్మించాడు అనుకొనే రీతిలో తిరుపతి జిల్లాలో చోటు చేసుకొన్న ఈ ఘటనతో కొత్త వింత ఆచారానికి అక్కడి గ్రామస్ధులు తెరలేపారు.
సూళ్లూరుపేట మండలం, మంగళంపాడు గ్రామంలోని రైతు పొలంలోకి ప్రవేశించిన ఓ కోతిపై స్థానికంగా ఉంటున్న శునకాలు దాడి చేశాయి. దీంతో ఆ కోతి వంటిపై తీవ్రగాయాలు చోటు చేసుకొన్నాయి. కొనఊపిరితో గిలగిల కొట్టుకొంటున్న ఆ కోతికి చికిత్స చేసేందుకు ప్రయత్నించిన గ్రామస్ధులకు చింతే మిగిలింది. అప్పటికే ఆ కోతి చనిపోయిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
దీంతో కోతి నుండే మానవుడు జన్మించింది, అని భావించిన గ్రామస్ధులు కుటుంబంలోని వ్యక్తి మరణిస్తే ఏ విధంగా కర్మక్రియలు చేస్తారో అలా చేపట్టారు. చనిపోయిన కోతిని ఊరేగింపుగా తీసుకెళ్లి, డప్పుల, మేళాల నడుమ దాని అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతేనా కోతి మరణించిన 9వ రోజున సామూహికంగా గ్రామస్తులంతా కలిసి భోజనాలు చేశారు.
అనంతరం చనిపోయిన కోతికి గుర్తుగా భగవంతుడిగా కీర్తించబడుతున్న ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా భావిస్తూ, కోతి మరణించిన ప్రదేశంలో గుడిని కట్టేందుకు గ్రామస్ధులు సిద్దమైనారు. ఒక విధంగా గ్రామస్ధులు నిండు మనసుతో వింత ఆచారానికి తెరలేపినప్పటికి, దైవానికి, జంతువుల మద్య కూడా సంబంధాలు ఉన్నాయని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తుంటాయి.
ఇది కూడా చదవండి: వెంకన్న దర్శనం కోసం కి.మీ మేర బారులు తీరిన భక్తులు