Last Updated:

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పధకంలో నగదు జమ చేసిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్‌ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పధకంలో నగదు జమ చేసిన సీఎం జగన్

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జమ చేశారు.

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: