Amith Shah: పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తాం…కేంద్ర హోం మంత్రి అమిత్ షా
జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజౌరిలో ఏర్పాటు చేసిన భాజపా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. కోటా ప్రయోజనాలను పరిశీలించేందుకు లెప్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలోని జస్టిస్ శర్మ కమిషన్ సిఫార్సుల మేర కోటా అమలు చేయనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందన్నారు. పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే ఒక భాష మాట్లాడే వారికి దేశంలో రిజర్వేషన్ కల్పించడం ఇదే తొలిసారి కానుంది. ఇందుకోసం పార్లమెంటులో రిజర్వేషన్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.
మరో వైపు ప్రతిపక్షాలపై అమిత్ షా విరుచక పడ్డారు. గతంలో జమ్మూకశ్మీర్ లో మూడు రాజకీయ కుటుంబాలు దోచుకున్నాయన్నారు. అభివృద్ధికి కేటాయించిన నిధులు కొందరికే సొంతమయిందని ఆరోపించారు. ప్రధాని మోదీ పటిష్ట చర్యలతో భద్రతా సిబ్బంది మరణాలు కూడా తగ్గాయన్నారు. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ సంఖ్య 136కు నేడు తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Betting sites :బెట్టింగ్ సైట్‌ల ప్రకటనలు మానుకోవాలి.. న్యూస్ వెబ్‌సైట్‌లు, టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక