Visakhapatnam East: విశాఖ తూర్పు నియోజకవర్గం
విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారాయాన, వెలగపూడి పై వరుసగా రెండు సార్లు ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
YCP Clashes: విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారాయాన, వెలగపూడి పై వరుసగా రెండు సార్లు ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆక్రమాని విజయనిర్మలకు ఆవకాశం కల్పించారు. ఆమె కూడ ఓటమి చవి చూడక తప్పలేదు.
మూడో సారి కూడా సీటు ఆశించినా, వంశీ కృష్ణ శ్రీనివాస్ కి సీటు రాకపోయేసరికి ఆయన వర్గీయులకు కోపం కట్టలు తెంచుకుంది. అందుకు విశాఖ పార్లమెంట్ ఎంపీ ఎంవీవీనే కారణమంటూ ఆయన కార్యాలయాన్ని ఎన్నికల సమయంలో ధ్వంసం చేశారు. చివరకు జగన్ మోహాన్ హామీ ఇవ్వడంతో ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. తరువాత కార్పొరేటర్‌గా ఆవకాశం ఇచ్చి, మేయర్ పీఠాన్నిఇస్తారని భావించినా, చివరి నిముషంలో జీవీఎంసీ 11 వార్డు కార్పొరేటర్ గొలగాని హారి వెంకటకుమారిని మేయర్‌గా ప్రకటించారు. ఆ క్రమంలో వంశీకి ఆన్యాయం చేశారనే స్వరం ఎక్కువడంతో విశాఖలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి ఆయనకు కట్టబెట్టారు. ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
భీమిలి నియోజకవర్గం నుండి విశాఖ తూర్పు నియోజకవర్గానికి వచ్చిన ఆక్రమాని విజయ నిర్మల తూర్పు నియోజకవర్గంలో ఓటమి పాలైనా, ఆమెకే అధిష్టానం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కొన్నినెలల క్రితం విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది. ప్రస్తుతం అక్రమాని విజయనిర్మల ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే విజయనిర్మల తూర్పు సమన్వయకర్తగా వచ్చినప్పటికీ, ముందు నుండి తూర్పులో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌కు అక్కడ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంది.
తూర్పు నియోజకవర్గం వైసీపీలో చాలా మంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. అయితే వారందరినీ పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారిని విజయనిర్మల ప్రోత్సహించడం మొదలుపెట్టారని సొంత పార్టీ వాళ్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వంశీ కృష్ణ శ్రీనివాస్ వర్గాన్ని విజయనిర్మల తొక్కే ప్రయత్నం చేస్తూన్నారని, విశాఖ తూర్పు వైసీపీ నాయకులు కారాలుమిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా ఆమె సొంతగా వర్గం తయారు చేసుకునే ప్రయత్నాల్లో ఉండటం పై గుర్రుగా ఉన్నారు.
దాంతో వంశీ, విజయనిర్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదే నియోజకవర్గంలో మేయర్ గొలగాని హారివెంకట కుమారి కూడా తన మార్కుతో పనిచేయాలని, తనకంటూ వర్గాన్ని తయారుచేసుకోవాలని చూస్తున్నారంట. అయితే ఆమెకు, ఆయన భర్తకు విజయనిర్మల కళ్లెం వేయాలని చూస్తున్నారన్న టాక్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో వినిపిస్తోంది. తూర్పు నియోజకవర్గంలో కనీసం మేయర్‌కు కూడా సమాచారం లేకుండా జీవీఎంసీకి సంబంధించిన, కార్యక్రమాలను విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు చేసేస్తున్నారు.
ఇప్పటికే విజయనిర్మల వర్గంగా కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. వారంతా బహిరంగ కలక్షన్ కౌంటర్లు ఓపెన్ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జీవీఎంసీ చైన్ మెన్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు చేయాల్సిన పనులు విజయనిర్మల వర్గం కార్పొరేటర్లు చేస్తున్నారంటూ సొంత పార్టీ వారే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమదైన లెక్కలతో ప్రతిపనికి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇబ్బందులేనంట, చివరకు వసూళ్లకు సంబంధించి సొంతపార్టీ వారిని కూడా వదలడం లేదంటే ఏ స్థాయికి పోయిందో అర్దమవుతోందంటున్నారు.
దానికి తోడు పార్టీని ముందు నుండి నమ్ముకున్న వారిని పక్కనపెట్టి, కొత్తవారికి పార్టీ పదవులు కట్టబెడుతున్నారట. తమ స్వలాభం కోసం రాజకీయ విద్వేషాలను సైతం, వ్యక్తి గత విద్వేషాలుగా మార్చేస్తున్నారని స్థాయి తీసుకువచ్చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్ల టిక్కెట్లు కూడా అమ్ముకున్నారని, వైసిపి నేతలే ఆరోపిస్తున్నారు. అప్పట్లో దానికి సంబంధించి వీడియోలు కూడా బయటపడిన పరిస్థీతి ఉందని, ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికి పార్టీ పెద్దలు మాత్రం వారికే కొమ్ముకాస్తున్నారని కేడర్ వాపోతోంది. అలా సాగిపోతోంది విశాఖ తూర్పులో వైసీపీ ప్రస్థానం.