Published On:

Dasara Holidays: రేపటి నుంచి కళాశాలలకు సెలవులు

రేపటి నుంచి అనగా 2 అక్టోబర్ 2022 నుంచి రాష్ట్రంలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అక్టోబ‌ర్ 10న క‌ళాశాల‌లు పున‌:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.

Dasara Holidays: రేపటి నుంచి కళాశాలలకు సెలవులు

Dasara Holidays: రేపటి నుంచి అనగా 2 అక్టోబర్ 2022 నుంచి రాష్ట్రంలోని ఇంట‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అక్టోబ‌ర్ 10న క‌ళాశాల‌లు పున‌:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. ద‌స‌రా సెల‌వుల్లో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే కళాశాలల యాజమాన్యాలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించే యాజ‌మాన్యాలపై చట్టపరమైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9వరకు 15 రోజుల పాటు తెలంగాణలోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. ఇక ఏపీలో అయితే 12 రోజుల పాటు సెలవులను జారీ చేసింది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: హై అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

ఇవి కూడా చదవండి: