Last Updated:

Allu Studios: అట్టహాసంగా అల్లు స్టూడియోస్ ప్రారంభం.. అల్లు వారు తరతరాలు గుర్తుంచుకోవాలి- చిరు

అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

Allu Studios: అట్టహాసంగా అల్లు స్టూడియోస్ ప్రారంభం.. అల్లు వారు తరతరాలు గుర్తుంచుకోవాలి- చిరు

Allu Studios: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

అల్లురామలింగయ్యను గుర్తుచేసుకుంటూ అల్లు కుటుంబ సభ్యులు మరియు మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. చాలామంది నటులలో కొద్దిమందికి మాత్రమే ఇలాంటి అరుదైన ఘనత లభిస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన వేసిన బాటలో అల్లు అరవింద్, బన్నీ(అల్లు అర్జున్), శిరీష్, బాబీ విజయవంతంగా నడుస్తున్నారని ఆయన తెలిపారు. ‘నటుడిగా ఎదగాలని నాడు రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్థగా మారిందని అల్లు వారు తరతరాలు ఆయనను తలుచుకుంటూనే ఉండాలని మెగాస్టార్ అన్నారు. ఆయన కుమారుడు అల్లు అరవింద్‌ను నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్‌ను స్థాపించి ఓ మార్గం చూపించారు. దీనిని లాభాపేక్ష కంటే కూడా స్టాటస్ సింబల్ అని నేను అనుకుంటున్నా అని చిరంజీవి అన్నారు.

చిరస్థాయిలో ఆయన పేరు నిలబడేలా కృషి చేసిన అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, బాబీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని మెగాస్టార్ అన్నారు. ఈ కుటుంబంలో తను కూడా భాగం కావడం హ్యాపీగా ఫీలవుతున్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: భార్యకు ప్రతీనెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలి.. సినీ నటుడు పృథ్వీరాజ్‌ కు ఫ్యామిలీకోర్టు ఆదేశాలు

ఇవి కూడా చదవండి: