Mla Vellampalli Srinivas: కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి హల్ చల్
ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.
Indrakeeladri: అధికారం అనే పదం వారికి సభ్యత, సంస్కారాన్ని మరిచేలా చేస్తుంది. సామాన్యుడికో న్యాయం, తమకో న్యాయంగానే వారంతా అధికారంలో కొనసాగుతున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.
వివరాల్లోకి వెళ్లితే, దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సామాన్య భక్తుల దగ్గర నుండి ముఖ్యులు వరకు అనేకులు అమ్మవారిని దర్శించుకొని తన్మయత్నంలో మునిగిపోతున్నారు.
ఇదే క్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 5వాహనాల్లో ఇంద్రకీలాద్రికి చేరుకొన్నారు. అనుమతి ఉన్న వ్యక్తుల వాహనాలకు మాత్రమే కొండ పైకి వెళ్లేందుకు వీలుంటుంది. దీంతో ఎమ్మెల్యే వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతించారు. ఆయనతో పాటు వచ్చిన మరో 4 వాహనాలను ఆపివేసారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వెల్లంపల్లి రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న పోలీసుల పై దురుసుగా మాట్లాడుతూ మిగిలిన వాహనాలను కూడా పంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
విధిలేని పరిస్ధితిలో అన్ని వాహనాలను పోలీసులు కొండపైకి అనుమతించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి తీరు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వెంట వెళ్లిన వారిలో వైకాపా నేతలు కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక దశలో చూస్తున్నవారు ఔరా అధికారమా అంటూ నోరెళ్లబెట్టారు.
ఇది కూడా చదవండి: కోవిడ్ ముగిసింది.. ఫ్రీ రేషన్ అవసరం లేదు.. క్యాపిటల్ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్