Railway Zone: విశాఖ రైల్వే జోన్ పై వదంతులు నమ్మొద్దు.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
New Delhi: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
నిన్న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టం 2014 పై చర్చించారు. ఈ స మావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. విశాఖలో రైల్వే జోన లేదని కేంద్ర అధికారులు ఈ సమావేశంలో చెప్పారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై ఆశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్మాణ వ్యయం అంచనా కూడా పూర్తైందన్నారు. భూసేకరణ కొంత పెండింగ్ లో ఉందన్నారు. దీని కారణంగానే పనులు కొంత ఆలస్యమౌతున్నాయని ఆయన వివరించారు. రైల్వే జోన్ విషయమై విభజన చట్టంలో ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే సంవత్సరాలు గడిచిపోయినా దీనిపై అడుగు ముందుకు పడలేదు. దీనికి అధికార వైసీపీ అసమర్దతే కారణమంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేహోదాను అటకెక్కించినట్లే ప్రత్యేక హోదాను కూడ పక్కనపెట్టినట్లేనని భావిస్తున్నారు. అయితే తాజాగా రైల్వే మంత్రి ప్రకటనతో దీనిపై ఆశలు చిగురించాయి.