Published On:

Harvard University Admissions: విదేశీ విద్యార్థులకు షాక్.. హార్వర్డ్ యూనివర్శిటీపై ఆంక్షలు

Harvard University Admissions: విదేశీ విద్యార్థులకు షాక్.. హార్వర్డ్ యూనివర్శిటీపై ఆంక్షలు

Trump Paused Harvard University Admissions: హార్వర్డ్ యూనివర్శిటీపై ట్రంప్ సర్కార్ మరోసారి ఆంక్షలు మోపింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఇచ్చిన సర్టిఫికేషన్ ను రద్దు చేసింది. హార్వర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగామ్ సర్టిఫికేషన్ తక్షణమే రద్దు చేయబడిందని హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజా పరిణామంతో హార్వర్డ్ యూనివర్శిటీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 

అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడు పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హార్వర్డ్ యూనివర్శిటీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిందని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యూనివర్శిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేశారు. అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలను యూనివర్శిటీ ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేశారు. దీంతో యూనివర్శిటీపై పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

 

అలాగే యూనివర్శిటీలో సిలబస్ మార్చాలని, అడ్మిషన్స్, ప్రవేశాల విధానాలు మార్చాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాలపై యూనివర్శిటీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. యూనివర్శిటీల్లో ప్రభుత్వాల పెత్తనం ఏంటని ప్రశ్నించింది. అందుకు సంబంధించి ట్రంప్ సర్కార్ నిర్ణయాలను తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే.. మరోసారి విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దంటూ.. సర్టిఫికేషన్ రద్దు చేయడంపై హార్వర్డ్ యూనివర్శిటీకి షాక్ తగిలింది.

 

కాగా హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకుని విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ యూనివర్శిటీకి లేఖ పంపారు. హార్వర్డ్ యూనివర్శిటీ యూదు మతానికి వ్యతిరేకంగా క్యాంపస్ లో కార్యక్రమాలు చేపడుతోందని, చైనా అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు చేసినట్లుగా పేర్కొన్నారు. సర్టిఫికేషన్ రద్దు కాకుండా ఉండాలంటే 72 గంటల్లో అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె సూచించారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు మరో యూనివర్శిటీకి వెళ్లడం, చట్టపరమైన హోదా కోల్పోవలసి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. యూనివర్శిటీ లెక్కల ప్రకారం ప్రతియేటా 500 నుంచి 800 మంది విద్యార్థులు హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రవేశం పొందుతున్నారు.