Vivo X200 FE Launch: మట్టిలో మాణిక్యం.. వివో కొత్త ఫోన్ భలేగా ఉంది.. లాంచ్ ఎప్పుడంటే..?
Vivo X200 FE Launching Soon in India: వివో మరో ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ పేరు Vivo X200 FE. ఈ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈలోగా ఈ ఫోన్ థాయిలాండ్ NBTC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో జాబితా చేశారు. ఈ సమాచారాన్ని ఎక్స్పర్ట్పిక్ అందించింది. లిస్టింగ్ ప్రకారం, ఫోన్ మోడల్ నంబర్ V2503. ఈ జాబితా నుండి ఫోన్ లాంచ్ తేదీ ఎంతో దూరంలో లేదని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్‌ను EEC అథారిటీ ఆఫ్ యూరప్ కూడా ఆమోదించింది. అంటే ఈ ఫోన్ యూరప్‌లో కూడా లాంచ్ అవుతుంది.
Vivo X200 FE Launch Date
కొన్ని రోజుల క్రితం, ఈ ఫోన్ SIRIM, TUV సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కనిపించింది. ఈ జాబితాలన్నింటినీ బట్టి చూస్తే, ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో జూలైలో లాంచ్ కావచ్చు. లీకైన నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్స్‌తో వస్తుంది.
Vivo X200 FE Specifications
లీకైన నివేదిక ప్రకారం.. Vivo X200 FE 6.31-అంగుళాల LTPO OLED డిస్ప్లేతో రావచ్చు. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేయగలదు. ఫోటోగ్రఫీ కోసం, దీనికి LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాను అందించవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్,50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు. అదే సమయంలో కంపెనీ సెల్ఫీ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు.
ప్రాసెసర్‌గా ఫోన్లో డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌ను చూడచ్చు. ఫోన్ బ్యాటరీ 6500mAh కావచ్చు. TUV సర్టిఫికేషన్ ప్రకారం, ఈ బ్యాటరీ 90 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15 పై పనిచేయగలదు. భారతదేశంలో ఈ ఫోన్ 12GB + 256GB,16GB + 512GB అనే రెండు వేరియంట్లలో రావచ్చు. దీని ధర 50 నుండి 60 వేల రూపాయల మధ్య ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన Vivo S30 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- Nothing Phone 3: సూపర్ అప్‌గ్రేడ్స్.. నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్..!