Bathukamma: ఇండియా గేట్ వద్ద బతుకమ్మ సంబరాలు
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది
India Gate: దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సంస్కృతి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఆయన సతీమణి, కావ్, జీవిత రాజశేఖర్, హైదరాబాదు మాజీ మేయర్ బండ కార్తీక, పలువురు మహిళలు బతుకమ్మ ఆడిపాడారు.
దీనిపై ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ నాయకురాలు కవిత పండుగను సైతం రాజకీయం చేసారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాలకు కర్తవ్యపధ్ వద్ద బతుకమ్మ సంబరాలను చేపట్టారని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసిఆర్ గొప్పతనంగా వ్యాఖ్యానించారు. తెలంగాణాలో సర్దార్ వల్లబాయి పటేల్ పేరుతో భాజాపా విమోచనం చేపట్టింది. అదే గుజరాత్ లో పటేల్ విగ్రహం ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటుందని ఎద్దేవా చేసారు. రెండింటల్లో ఏదో ఒకటి కోరుకోవాలని భాజాపా పెద్దలకు సూచించారు.
అయితే ఇదంతా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోద్భలంతోనే కేంద్రం కర్తవ్యపధ్ వద్ద బతుకమ్మ సంబరాలను అధికారికంగా చేపట్టిందని చెప్పాల్సిందే. భక్తి కార్యక్రమాన్ని సైతం తమ ఖాతాలో వేసుకొనేందుకు తెలంగాణ భాజాపా పెద్ద సుముఖంగా లేనట్లు సమాచారం. ఇక కవిత మాటలతో భాజాపా కూడ రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్దం కాక తప్పదని గ్రహించాలి. మరోవైపు తొలి నుండి భాజాపా కోరుతున్నట్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచనం దినం చేపట్టడంతో కేంద్రం కూడా బతుకమ్మ పండుగను ఢిల్లీ లో అధికారికంగా చేపట్టిందని చెప్పాలి.
ఇది కూడా చదవండి:Supreme Court: సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ