Last Updated:

New Mandals: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి సెప్టెంబర్ 26వ సోమవారం నుంచే అధికారికంగా అమల్లోకి వస్తాయంటూ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

New Mandals: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు

New Mandals: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించిన అనంతరం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఇవి సెప్టెంబర్ 26వ సోమవారం నుంచే అధికారికంగా అమల్లోకి వస్తాయంటూ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

కొత్తగా ఏర్పడిన మండలాలు పేర్లు ఇవే: 
ఎండపల్లి, భీమారం, నిజాంపేట, గట్టుప్పల, డోంగ్లీ, సీరోల్, ఇనుగుర్తి, కౌకుంట్ల, ఆలూరు, డొంకేశ్వర్, సాలూర,
అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూర్‌పల్లి, ఎండపల్లి మండలంలో 13 గ్రామాలుండగా ఇది జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోకి వస్తుంది. అలాగే  గట్టుప్పలలో 6 (నల్గొండ), సీరోల్‌లో 6 (మహబూబాబాద్), ఇనుగుర్తిలో 5 (మహబూబాబాద్), కౌకుంట్లలో 9 (మహబూబ్‌నగర్), డోంగ్లీలో 15 (బాన్సువాడ), ఆలూరులో 7 (ఆర్మూర్), డొంకేశ్వర్‌లో 12 (ఆర్మూర్), సాలూరలో 10
(బోధన్), అక్బర్‌పేట-భూంపల్లిలో 13 (సిద్ధిపేట), కుకునూర్‌పల్లిలో 15 (గజ్వేల్) భీమారంలో 9 గ్రామాలు (కోరుట్ల రెవెన్యూ డివిజన్), నిజాంపేటలో 9 గ్రామాలు (నారాయణ్‌ఖేడ్), గ్రామాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఏసీబీ వలలో దామరగిద్ద తహశీల్దారు వెంకటేష్

ఇవి కూడా చదవండి: