Henley Passport Index 2022: ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్టులు ఇవే..
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాలు ఆక్రమించాయి. ప్రస్తుతం కోవిడ్ -19 కంటే ముందు నాటి స్థాయికి పరిస్థితులు వస్తున్నాయి. కాగా కోవిడ్ కంటే ముందు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌ల్లో యూరోపియన్ దేశాలు అగ్రస్థానం ఆక్రమించాయి. ఇక జపాన్ పాస్‌పోర్టును తీసుకుంటే ఈ పాస్‌పోర్టు
Prime9Special: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాలు ఆక్రమించాయి. ప్రస్తుతం కోవిడ్ -19 కంటే ముందు నాటి స్థాయికి పరిస్థితులు వస్తున్నాయి. కాగా కోవిడ్ కంటే ముందు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌ల్లో యూరోపియన్ దేశాలు అగ్రస్థానం ఆక్రమించాయి. ఇక జపాన్ పాస్‌పోర్టును తీసుకుంటే ఈ పాస్‌పోర్టు తీసుకొని ఏకంగా 193 దేశాల్లో ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్ల ఇబ్బందులు లేకుండా ప్రవేశించవచ్చు. అలాగే సింగపూర్, దక్షిణ కొరియా పాస్‌పోర్టులతో కూడా ఎలాంటి నిబంధనలు, లేదా అనుమతుల్లేకుండా 193 దేశాల్లో ప్రవేశించవచ్చునని తాజాగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్. ఇమ్మిగ్రేషన్ కన్సెల్టెన్సీ విడుదల చేసిన ర్యాంకింగ్‌ను బట్టి తెలుస్తోంది.
ఇక రష్యా పాస్‌పోర్టు 50వ ర్యాంకు సాధించింది. 119 దేశాల్లో నిరభ్యంతరంగా ఎంట్రీ అయ్యేందుకు వీలుంటుంది. చైనా విషయానికి వస్తే 69వ ర్యాంకులో ఉంది. 80 దేశాల్లో ప్రవేశించడానికి ఈ పాస్‌పోర్టుతో వీలుంటుంది. ఇక ఇండియా విషయానికి వస్తే 87వ ర్యాంకులో ఉంది. 27 దేశాల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఆఫ్గానిస్తాన్ విషయానికి వస్తే ఈ పాస్‌పోర్టుతో అతి తక్కువ ప్రయోజనం ఉందని హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ వెల్లడించింది.
అయితే 2017 నాటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఆసియా దేశాలు బాగా మెరుగుపడ్డాయి. ఆసియా దేశాలకు చెందిన పాస్‌పోర్టులు టాప్ 10లో స్థానం దక్కించుకోవడం గగనంగా ఉండేది. అయితే యూరోపియన్ దేశాల పాస్‌పోర్టులు క్రమంగా బలహీనపడ్డంతో అదే సమయంలో దక్షిణ కొరియా పాస్‌పోర్టు బలోపేతం కావడంతో ప్రస్తుతం జర్మనీ పాస్‌పోర్టును దక్షిణ కొరియా పాస్‌పోర్టు కంటే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఒక బ్రిటన్ పాస్‌పోర్టు విషయానికి వస్తే ఆరవ ర్యాంకులో ఉంది. సుమారు 187 దేశాల్లో ప్రవేశించవచ్చు. అమెరికా పాస్‌పోర్టు విషయానికి వస్తే 7వ ర్యాంకు సాధించింది 186 దేశాల్లో ప్రవేశించవచ్చు.
ఇక పాస్‌పోర్టు ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే 17 సంవత్సరాల డేటాను తీసుకుంది. సంపన్నులు, ప్రభుత్వాలు పాస్‌పోర్టును బట్టి తేలికగా వీసాలు ఇవ్వడం, లేదా అరైవల్ ఆన్ వీసా యాక్సిస్‌ను బట్టి పాస్‌పోర్టును ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. ప్రస్తుతం కోవిడ్ వల్ల పర్యాటకులపై కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.