Published On:

Idly Kadai: ధనుష్ ఇడ్లీ కొట్టు వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే.. ?

Idly Kadai: ధనుష్ ఇడ్లీ కొట్టు వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే.. ?

Idly Kadai: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా.. నిర్మాతగా కూడా బిజీగా మారాడు ధనుష్. ఆయన దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక ప్రస్తుతం ధనుష్  చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగులో కుబేర సినిమాతో బిజీగా ఉన్న  ధనుష్.. ఇంకోపక్క ఇడ్లీ కడై అనే సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్న విషయం తెల్సిందే. వండర్‌బార్ ఫిలింస్ బ్యానర్ పై ధనుష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ కానుంది.

 

ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి నుంచి ఇడ్లీ కడై.. ఏప్రిల్ 10 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు.అయితే  గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు.

 

అనుకున్న సమయానికే తమ సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. కానీ, ఏప్రిల్ వచ్చినా ఈ సినిమాకుసంబంధించిన  ప్రమోషన్స్ ఇప్పటివరకు మొదలుపెట్టింది లేదు. షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందుకే ఇడ్లీ కడై  వాయిదా పడే ఛాన్స్ లు ఉన్నాయని పుకార్లు గట్టిగా వచ్చాయి.

 

ఇక ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా చిత్ర బృందం కూడా ఇడ్లీ కడై  వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. ఇడ్లీ కడై  సినిమా అక్టోబర్ 1 న రిలీజ్ కానుంది. అయితే వాయిదాకు కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.