HMD Phones: స్మార్ట్‌ఫోన్లే కాదు.. ఈ ఫీచర్ ఫోన్లు కూడా ట్రై చేయండి.. హెచ్ఎండీ నుంచి రెండు ఫోన్లు వచ్చాయ్.. ఫీచర్స్ భలే ఉన్నాయ్..!

HMD Phones: హెచ్ఎండీ భారతదేశంలో UPI సపోర్ట్‌తో రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. ఇంతకుముందు, నోకియా ఫోన్ తయారీ సంస్థ ఈ ఫీచర్ ఫోన్‌లు HMD 130 Music, HMD 150 Music పేరుతో పరిచయం చేసింది. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు మల్టీ కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేశారు. ఈ ఫోన్లు 2,500mAH శక్తివంతమైన బ్యాటరీతో వస్తాయి. ఈ ఫోన్‌లో 36 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతే కాదు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల పాటు మ్యూజిక్ ప్లేని ఆస్వాదించచ్చు.
HMD 130 Music, HMD 150 Music Price
హెచ్ఎండీ 130 మ్యూజిక్‌ని రూ. 1,899కి విడుదల చేసింది. ఈ ఫోన్ బ్లూ, డార్క్ గ్రే, రెడ్ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. అయితే, HMD 150 మ్యూజిక్ ధర రూ. 2,399. ఇది లైట్ బ్లూ, పర్పుల్, బూడిద రంగులలో కొనుగోలు చేయచ్చు. ఈ రెండు ఫోన్‌లను HMD వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు, రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయచ్చు.
ఈ ఏడాది జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో హెచ్ఎండీ ఈ రెండు ఫీచర్ ఫోన్‌లను పరిచయం చేసింది. వీటిలో 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. ఇవి S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తాయి. ఇది 8MB RAM+ 8MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. మీరు మైక్రో SD ద్వారా దీని స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్ సి ఛార్జింగ్ ఫీచర్లు ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.
UPI Features
యూపీఐ లావాదేవీల కోసం పే ఫీచర్ హెచ్ఎండీ 150 మ్యూజిక్‌లో అందించారు. ఈ రెండు ఫోన్‌లు 50 గంటల బ్యాటరీ బ్యాకప్ ,IP52తో వస్తాయి, దీని కారణంగా వాటర్ స్ప్లాష్, డస్ట్ మొదలైన వాటి వల్ల ఇది పాడైపోదు.
హెచ్ఎండీ ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్‌తో వస్తాయి. ఇందులో 2W ఆడియో అవుట్ స్పీకర్, FM రేడియోను రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంది. హెచ్ఎండీ ఈ రెండు ఫీచర్ ఫోన్‌లతో కంపెనీ ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని ఇస్తుంది.