IPL 2025: ముంబై ఇండియన్స్ సారథిగా సూర్యకుమార్ యాదవ్

Mumbai Indians announce Suryakumar Yadav as new captain IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టును నడిపిస్తాడని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా ముంబై ఫ్రాంచైజీ తొలి మ్యాచ్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు. తాజాగా, మీడియాతో పాండ్యా స్వయంగా కొత్త సారథి పేరును ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న తమ తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడని చెప్పాడు.
‘నేను అదృష్టవంతుడిని. ముగ్గురు కెప్టెన్లతో ఆడుతున్నాను. రోహిత్, సూర్యకుమార్, బుమ్రా. వారెప్పుడు నాకు మద్దతుగా నిలుస్తారు’ అని కూడా వ్యాఖ్యానించాడు. దీంతో మొదటి మ్యాచ్‌కు కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ కు ముంబై అభిమానులు అభినందనలు చెప్పారు.
ఇక, గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్ ఆడింది. నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యకు రూ. 30 లక్షల జరిమానాతోపాటు ఒక మ్యాచ్‌లో ఆడకుండా బ్యాన్ విధించారు. కానీ, ముంబై పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో హార్దిక్‌పై మ్యాచ్ నిషేధం విధించడం కుదరలేదు. అందుకే, ఇప్పుడు తొలి మ్యాచ్‌లో హార్దిక్‌ను బ్యాన్ చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీగా నియమించుకున్నాడు.