SSMB29 Odisha Schedule: ఒడిశా షెడ్యూల్ పూర్తి – సెట్స్ ఫోటోలు వైరల్

SSMB29 Wrap Up Odisha Schedule: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని కోరాపుట్ కొండలపై యాక్షన్, అడ్వెంచర్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ మంగళవారంతో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు అధికారులు స్వయంగా లోకేషన్స్‌కి SSMB29ని కలిసింది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళితో పాటు ఇతర మూవీ టీంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా జక్కన్న ఇచ్చిన నోట్ కూడాని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కాగా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇదోక యాక్షన్ అడ్వెంచర్ చిత్రమని, ఇందులో హాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులు కూడా భాగం కానున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈచిత్రానికి జక్కన్న మైథలాజికల్ టచ్ కూడా ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని జక్కన్న గోప్యంగా ఉంచుతున్నాడు.
And that’s a wrap for ~ Action Sequence Done ✅ #SSMB29 🎬✨@urstrulyMahesh 🦁🔥
Truly a privilege to witness the magic unfold. Grateful for the journey and beyond excited for what’s next @ssrajamouli !
~ 💃🕺🧨 The shoot is going on a full swing✨@priyankachopra @ssk1122 pic.twitter.com/MrzRT47QRL— Odisha MAHESH FC™🌍 (@OdishaMaheshFC) March 18, 2025
Even SS Rajamouli himself referred to the upcoming film as #SSMB29, not #SSRMB!#SSMB29 💥🔥 #MaheshBabu 👑 pic.twitter.com/i0fp0B9vOb
— Movies4u (@Movies4uOfficl) March 18, 2025
మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కనీసం ఫోటోలు కూడా బయటకు రాకుండ జాగ్రత్త పడింది టీం. ఫస్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్ శివారులోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిపినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ షెడ్యూల్‌ని ఒడిశా అడవి ప్రాంతంలో ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. సెట్‌లో వారితో దిగిన ఫోటోలను కూడా షెర్ చేశారు. అయితే చిత్రీకరణ సమయంలో మహేష్- పృథ్వీరాజ్ మధ్య తెరకెక్కిస్తున్న సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అవ్వగా అతి విపరీతంగా వైరల్ అయ్యింది.
SuperStar @urstrulyMahesh after wrapping the Odisha schedule for #SSMB29 had meeting with local authorities pic.twitter.com/T6W5xQizUy
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2025