10th Exams : ఈ నెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు

10th Exams : తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. పరీక్షలకు 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2,650 పరీక్షా కేంద్రాలను బోర్డు ఆఫ్ సెకండరీ స్కూల్ ఏర్పాటు చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి.