Last Updated:

Betting Apps-Supritha Bandaru: నాపై వస్తున్న వార్తలు అబద్ధం – ఎవరూ ఆందోళన చెందకండి: సుప్రీత

Betting Apps-Supritha Bandaru: నాపై వస్తున్న వార్తలు అబద్ధం – ఎవరూ ఆందోళన చెందకండి: సుప్రీత

Supritha Bandaru Shared Video on Rumours: నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వకముందే సోషల్‌ మీడియాలో పుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసి నెటిజన్స్‌ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. బిగ్‌బాస్‌ 7 రన్నరప్‌ అమర్‌దీప్‌ చౌదరితో హీరోగా వస్తున్న ఓ సినిమాలో సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక త్వరలో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన ఆమెకు తాజాగా బెట్టింగ్‌ యాప్‌ వ్యవహరంలో షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంలో ఆమె పేరు బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన ఏదోక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో సుప్రీత ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలన నమ్మొద్దని తన ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడింది. “హాయ్‌.. అందరికి నమస్కారం. నేను మీ సుప్రీత.

సోషల్ మీడియాతో పాటు మీడియా ఛానెల్స్‌లో నాపై వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్‌ ప్రచారం. నేను చాలా సేఫ్‌గా ఉన్నా. నేను ఎక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. నాపై వస్తున్న ప్రచారాలన్ని అబద్దాలు. మీ అందరికి నా ధన్యవాదాలు. నేను క్షేమంగానే ఉన్నాను. ఎలాంటి ఆందోళనకు గురి కావోద్దు. థ్యాంక్యూ యూ సో మచ్‌ ఆల్‌” అంటూ చెప్పుకొచ్చింది. కాగా బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల ఎంతో మంది యువత, అమాకప్రజలు మోసపోతున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఆర్టీసీ ఎండీ, మాజీ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ రంగంలోకి దిగారు. #saynotobettingapp అంటూ బెట్టింగ్‌ యాప్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఈ మేరకు తరచూ పోస్టులు పెడుతూ యువతలో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈ యాప్స్‌ని ప్రమోట్‌ చేస్తూ తమ ఫాలోవర్స్‌ ప్రభావాతం చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌, ఇన్‌ఫ్లూయేన్సర్లపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇస్తున్నారు.