Upcoming MPV Cars: అదిరిపోయే కార్లు వచ్చేస్తున్నాయ్.. ఎంపీవీ మార్కెట్‌లో ప్రకంపనలు ఖాయం..!

Upcoming MPV Cars: భారత్‌లో ఎంపీవీ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందది. మారుతి సుజికి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లు ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు కూడా రానున్న రోజుల్లో కొత్త ఎమ్‌పివిని కొనాలనే ఆలోచిస్తుంటే ఈ వార్త మీ కోసమే. నిజానికి చాలా కంపెనీలు తమ కొత్త ఎమ్‌పివి మోడళ్లను 2025లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అటువంటి రాబోయే మూడు ఎమ్‌పివిల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Kia Carens Facelift
కియా తన పాపులర్ ఎంపీవీ కేరెన్స్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. వినియోగదారులు కొత్త కారు బాహ్య, లోపలి భాగంలో పెద్ద మార్పులను చూస్తారు. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.
Renault Triber Facelift
దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు ట్రైబర్‌ను అప్‌డేట్ చేయడానికి రెనాల్ట్ సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ 2025 సంవత్సరం ద్వితీయార్థంలో ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త రెనాల్ట్ ట్రైబర్‌లో కస్టమర్‌లు అనేక ఫీచర్ అప్‌డేట్‌లను పొందుతారు. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.
MG M9
MG మోటార్స్ దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అధికారికంగా ఆవిష్కరించింది. MG M9 ఏప్రిల్‌లో విడుదల కానుంది. అయితే దీని ప్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. MG M9 తన వినియోగదారులకు ఒక్కసారి ఛార్జింగ్‌పై 430 కిలోమీటర్ల పరిధిని అందించగలదని నివేదికలు క్లెయిమ్ చేస్తున్నాయి.