Last Updated:

Mahindra XUV 700 Ebony Edition: స్టన్నింగ్ లుక్‌తో మహీంద్రా XUV700 బ్లాక్ ఎడిషన్.. రేటెంతో తెలుసా..?

Mahindra XUV 700 Ebony Edition: స్టన్నింగ్ లుక్‌తో మహీంద్రా XUV700 బ్లాక్ ఎడిషన్.. రేటెంతో తెలుసా..?

Mahindra XUV 700 Ebony Edition: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 700’ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. బెస్ట్ మైలేజీ, సూపర్బ్ లుకింగ్, మంచి సేఫ్టీ ఫీచర్లు కారణంగా ఈ కారును కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎటుచూసిన ఈ కార్లే కనిపిస్తున్నాయి. ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసి మూడేళ్లు దాటినా.. అతి తక్కువ కాలంలోనే రెండు లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఇప్పుడు బ్లాక్ వెర్షన్‌లో ఇండియన్ రోడ్లపైకి వచ్చింది.

మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ (బ్లాక్ ఎడిషన్) లాంచ్ చేసింది. కొత్త ఎబోనీ ఎడిషన్ ఎక్సటర్నల్, ఇంటర్నల్ క్యాబిన్ లోపల కాస్మొటిక్ అప్ డేట్లతో వస్తుంది. గత రెండు వారాల్లో డార్క్ ఎడిషన్ లేదా బ్లాక్ ఎడిషన్ పొందిన టాటా సఫారీ, టాటా హారియర్, ఇతర SUVల తర్వాత మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ మార్చి 17న భారతదేశంలో రిలీజ్ అయింది. స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ఈ SUV సాధారణ వెర్షన్ లాగానే ఉంటుంది.

మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ (బ్లాక్ ఎడిషన్) విడుదల చేసింది. ఈ కొత్త కారు క్యాబిన్ లోపల కాస్మోటిక్ అప్‌డేట్‌తో తీసుకొచ్చింది. మార్చి 17 అంటే ఈ రోజున లాంచ్ అయింది. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ఈ బ్లాక్ ఎస్‌యూవీ సాధారణ వెర్షన్ లానే ఉంటుంది. అయితే దీని కంటే ముందు టాటా సఫారీ, హారియర్ బ్లాక్ ఎడిషన్‌లో లాంచ్ అయ్యాయి.

Mahindra Launches XUV700 Ebony Edition
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎబోనీ ఎక్సటర్నల్‌గా చూస్తే స్టీల్త్ బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తుంది. కొన్ని కీలకమైన డిజైన్ అంశాంల్లో బ్లాక్ ఆన్ బ్లాక్ గ్రిల్ ఇన్సర్ట్స్, బ్రష్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, బ్లాక్డ్ అవుట్ ఓఆర్వీఎమ్ ఉన్నాయి. దీనికి 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ అందించారు.

అంతేకాకుండా బ్లాక్, సిల్వర్ కలర్స్ ఎక్సటర్నల్‌‌గా ఈ ఎస్‌యూవీకి స్పెషల్ లుక్ ఇస్తాయి. ఎబోనీ ఎడిషన్‌లోని మిగిలిన భాగం ఇంటీరియర్‌పై అనేక కాస్మోటిక్ మార్పులు చేసింది. క్యాబిన్‌లో డోర్ ప్యానెల్స్ వెంట బ్లాక్ లెథరెట్ అప్హోల్స్టరీ, సెంటర్ కన్సోల్, సిల్వర్ యాక్సెంట్స్, బ్లాక్ ట్రిమ్స్, ఉన్నాయి. డ్యూయల్ టోన్ థీమ్ కోసం లేత గ్రే కలర్ రూఫ్ లైనర్ అందించారు. క్యాబిన్ లోపల ఉన్న కొన్ని ఇతర డిజైన్ అంశాలలో డార్క్ క్రోమ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎబోనీ ఎడిషన్ AX7, AX7L వేరియంట్స్ 7-సీటర్ ఫార్వాడ్ వెర్షన్‌లపై ఆధారపడి ఉంటుంది. AX7 ఎబోనీ ఎడిషన్ ధర రూ.19.64 లక్షల నుండి మొదలై రూ. 21.79 లక్షల వరకు ఉండగా, AX7L వేరియంట్ ధర రూ. 23.34 లక్షల నుండి రూ. 24.14 లక్షల మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోని చాలా బ్రాండ్లు వినియోగదారులకు డార్క్ ఎడిషన్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఈ కొత్త కారు ఎంత ప్రజాదరణ పొందుతుందో చూడాలి.