Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే దంపతుల దుర్మరణం

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. బాధితులు శ్రీకాకుళంలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.